మహేష్ సినిమాతోనే నమ్రత రీ ఎంట్రీ..?

Posted February 14, 2017

namratha reentry in mahesh movieటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత  త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది మహేష్ చిత్రంతోనేనట. వంశీ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ పెళ్లి చేసుకోడంతో ఆమె ఇంటికే పరిమితం అయ్యింది. కాగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇవ్వడం, అందునా అది ఆమె భర్త మహేష్ సినిమానే అవ్వడంతో మహేష్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో  నమ్రత కీలక పాత్రలో నటిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  సంభవామి అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ సినిమాలో మహేష్  ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కాగా ఒక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్ రోల్ ను నమ్రత పోషిస్తోందని సమాచారం.  వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన  వంశీ యవరేజ్ కాగా మరి ఈ సినిమా అభిమానులను  ఎలా అలరిస్తుందో చూడాలి.