బౌండరీ కొడుతున్న నాని..

  naani boundary four movies year

ఇప్పటి హీరోలు ఏడాది ఒక్క సినిమా చేయడానికి కష్టపడుతుంటే నాని మాత్రం ఈ ఏడాది నాలుగు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు చిత్రాలు థియేటర్స్ లో అడుగిడి విజయం సాధించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, జూన్ లో ‘జెంటిల్ మన్ ‘గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నాని, ఈ సినిమాను సెప్టెంబర్ 17న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు నాని. దిల్ రాజు నిర్మాణంలోత్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘నేను లోకల్’ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఈ సినిమాలో నవీన చంద్ర విలన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు నాని.