నాని సినిమా జాతకం మార్చేసింది..!

Posted December 3, 2016

Image result for anu emmanuel

నాచురల్ స్టార్ నాని తన ప్రతి సినిమాకు కొత్త భామలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. రీసెంట్ గా మజ్ను సినిమాతో ప్రియ, అను ఇమ్మాన్యుయెల్ ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు నాని. ఇక సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన అనుకి తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఆల్రెడీ మలయాళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అను ఇమ్మాయుయెల్ ఇప్పుడు తెలుగులో కూడా అదే రేంజ్ ఆఫర్లు తెచ్చుకుంటుంది.

ఇక అమ్మడికి లక్కీగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ దొరికిందని అంటున్నారు. త్రివిక్రం పవన్ కాంబినేషన్లో మూవీకి ఇద్దరు హీరోయిన్స్ అవసరముండగా ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ఇప్పటికే ఫైనల్ అయ్యింది. ఇక సెకండ్ హీరోయిన్ గా అనుని ఓకే చేసే ఆలోచనలో ఉన్నారట. పవర్ స్టార్ సినిమా అంటే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ వచ్చేసినట్టే. స్కోప్ ఎక్కువగా ఉండటం వల్ల అను అందరి దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఆఫర్ తో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది ఈ అమ్మడు. పవర్ స్టార్ సినిమాలో చిన్న రోల్ అయినా చాలు అనుకునే ఈ చిన్నది ఇప్పుడు పవర్ స్టార్ తో రొమాన్స్ చేయడం అంటే అమ్మడి లక్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

నాని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం రెండో సినిమానే పవర్ స్టార్ తో నటించడం అంటే ఇంతకంటే లక్కే హీరోయిన్ ఎవరు ఉండరని చెప్పొచ్చు. ఓ పక్క పవర్ స్టార్ సినిమా చర్చల్లో ఉండగానే రాజ్ తరుణ్ తో ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అను.