లోకేష్ కౌంటర్ చేస్తే చాలదా?

0
99

Posted April 18, 2017

nara lokesh approach to the tdp supported websites
కొత్తగా మంత్రి పదవి చేపట్టిన టీడీపీ యువనేత లోకేష్ దృష్టంతా ఇప్పుడు సోషల్ మీడియా మీద పడింది.దాన్ని ఆయుధంగా మలుచుకుని జగన్ అండ్ కో చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే నష్టమని ఎప్పటినుంచో టీడీపీ శ్రేయోభిలాషులు నెత్తినోరు బాదుకుంటున్నా పట్టించుకున్న వాళ్ళే లేరు. ప్రమాణస్వీకారం,అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రసంగంలో తన తడబాట్లని విస్తృత ప్రచారం చేస్తూ సోషల్ మీడియా రెచ్చిపోవడాన్ని లోకేష్ సీరియస్ గా తీసుకున్నారు.తప్పుడు ప్రచారం చేసేవాళ్ల మీద అవసరమైతే కేసులు పెడదామని లోకేష్ సన్నిహితులు కొందరు సలహా ఇస్తున్నారట.దీని వల్ల మీడియా వ్యతిరేకత కూడగట్టుకోవడం తప్ప ఒరిగేదేమీ లేదు.

లోకేష్ ఈ పరిస్థితుల్లో చేయాల్సింది కేసులు పెట్టడం కాదు.తన మీద దాడి చేస్తున్న సోషల్ మీడియానే వేదికగా చేసుకుని కౌంటర్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది.అలాగాకుండా అసలు సోషల్ మీడియాలో ప్రతికూల వార్తలు రాకుండా చేయాలనుకోవడం అలివిమాలిన పని.ఇందులో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాలేరు కూడా. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియా లో ప్రధాన వెబ్ సైట్స్ తో పాటు మెజారిటీ సైట్స్ జగన్ కనుసన్నల్లో నడుస్తున్నాయి.వాటికి జగన్ తో పాటు ఆయన అనుచరగణం నుంచి ఆర్ధిక సాయం కూడా అందుతున్నట్టు తెలుస్తోంది.అలాగే చేయకపోయినా సోషల్ మీడియా లో టీడీపీ అనుకూల వెబ్ సైట్స్ ఎంచుకుని వాటితో నిరంతర సలహాసంప్రదింపులతో జగన్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు వైసీపీ మీద కౌంటర్ ఎటాక్ చేయొచ్చు.అనుకూల వెబ్ సైట్స్ ని సమీకృతం చేయడం మీద ఇప్పటికైనా లోకేష్ టీం దృష్టి పెడితే మంచిది.