నా కుటుంబమే నాకు రోల్ మోడల్ ..నారా లోకేష్

Posted November 18, 2016

nara lokesh said my role model is my familyనా కుటుంబమే నాకు రోల్ మోడల్ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు,నందమూరి తారక రామారావు మనుమడిగా,చంద్రబాబు కుమారుడిగా తాను ఎంతో గర్వ పడుతున్నానని మొత్తంగా తనకి అందరు రోల్ మోడల్స్ అని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని దానికంటే ముందు చదువు కోవాలని యువతకు సూచించారు తిరుపతిలోని చదలవాడ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు , భార్యగా బ్రాహ్మణి వన్ అండ్ ఓన్లీ లవ్ అనే కాంప్లిమెంట్ ఇచ్చారు .

lokesh says my first love and my first crush is my wife brahmaniవిద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అయన సంధానం ఇస్తూ ..నల్ల ధనాన్ని రెండు రకాలుగా పెరిగిందని ఒకటి వ్యాపారం మరొకటి అవినీతి వల్లనే అని అన్నారు. తాను కూడా చదువు పూర్తి చేసిన తరువాత ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా  పని చేసిన అనుభవం ఉందన్నారు, రిజర్వేషన్ లు , కరెన్సీ మార్పు పై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు .

నాకు ఫలానా దాంట్లోనే ఉద్యోగం రావాలి అని అనుకుంటూ వచ్చిన అవకాశాన్ని చేజార్చు కోవడం కాదని ఆలోచన విధానం లో మార్పు రావాలని కాస్త పడితే తప్ప ఫలితం రాదని చెప్పారు.ప్రజలు ఆన్లైన్ విధానాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని అన్నారు