భువనేశ్వరి చేయలేనిది..లోకేష్ చేసింది ఏమిటో?

Posted April 21, 2017 at 11:16

nara lokesh said to chandrababu PA don't put party meetings after 8 clock
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నా లోకేష్ ని ఇంకా ఆయన తండ్రి చాటు బిడ్డగానే చూస్తున్నారు చాలా మంది.అయితే ఏళ్ళకొద్దీ ప్రయత్నించినా ఓ విషయంలో చంద్రబాబుని ఎవరూ మార్చలేకపోయారు.మంత్రులు,మిత్రులు,అధికారులు ,బంధువులు ఇలా చివరకు భార్య భువనేశ్వరి కూడా బాబుని ఆ మ్యాటర్ లో కంట్రోల్ చేయలేకపోయారు.కానీ మంత్రివర్గంలో చేరిన కొద్దిరోజులకే ఆ ప్రాబ్లెమ్ సాల్వ్ చేసాడు లోకేష్.ఇంతకీ లోకేష్ పరిష్కరించిన ఆ సమస్య ఏంటో తెలుసా ?

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు అధికారులు,మంత్రులతో అటు పార్టీ నేతలు,కార్యకర్తలతో జరిపే సుదీర్ఘ సమీక్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒక్కోసారి రాత్రి పదకొండు,పన్నెండు గంటల దాకా ఈ సమీక్షలు జరుగుతాయి.ఈ విషయంలో చాలా మంది అలసటకు గురి అయి చంద్రబాబు తో పని చేయడం కష్టం అనుకుంటారు.కానీ ఒక్క సమీక్షలో పాల్గొనే వాళ్ళే అలా అనుకుంటే..అన్ని సమీక్షల్లో పాల్గొనే బాబు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన ఇబ్బంది గురించి గమనించి సతీమణి భువనేశ్వరి ఎన్నోసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయింది.కానీ ఇటీవలే మంత్రివర్గంలో చేరిన లోకేష్ కూడా ఇలా తన శాఖ అధికారులతో వరసగా సమీక్షలు నిర్వహించాల్సి వచ్చిందట.కొన్ని సందర్భాల్లో బాగా పొద్దుపోయేదట.దీంతో అలసటకు గురైన లోకేష్ యువకుడైన తన పరిస్థితే ఇలా ఉంటే ..ఇక 70 ఏళ్ళకి దగ్గరలో వున్న చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో వూహించగలిగారంట.వెంటనే సీఎం పేషీ అధికారులతో మాట్లాడి రాత్రి పొద్దుపోయాక ఇలాంటి సమీక్షల పని సీఎం కి పెట్టవద్దని కోరారట.అందుకు అనుగుణంగా వాళ్ళు మార్పులు చేయడంతో రాత్రి 8 గంటల కల్లా బాబు పనులు పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.ఆ విధంగా భువనేశ్వరి చేయలేని పని లోకేష్ చేశారు.