జగన్ కి బాబు మాట స్వీట్..లోకేష్ మాట యమ హాట్

0
105

Posted April 27, 2017 at 13:41

nara lokesh says there is no before assembly elections then jagan was shocked
2018 నవంబర్ లో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరగొచ్చని పార్టీ అంతర్గత సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు జగన్ కి స్వీట్ స్వీట్ గా అనిపించాయి.అందుకే ఆ మాట వినగానే జగన్ కి ఎక్కడ లేని హుషారు వచ్చింది.వెంటనే ప్రశాంత్ కిషోర్ ని పిలిపించుకుని ఎన్నికల వ్యూహం,ఖర్చు గురించి చర్చలు జరిపారు.ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.2014 ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూసిన జగన్ కి ముందస్తు మాట వినగానే కొత్త జోష్ పుట్టుకొచ్చింది.రాజకీయంగా బద్ధశత్రువైనా చంద్రబాబు మాటే జగన్ కి స్వీట్ అయ్యింది.అయితే ఆ స్వీట్ ని హాయిగా ఆస్వాదించే లోగా లోకేష్ యమ హాట్ పుట్టించే మాటలతో ముందుకొచ్చాడు.జగన్ ఉత్సాహం మీద నీళ్లు చల్లాడు.

విజయవాడలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన లోకేష్ ముందస్తు ఎన్నికలు అన్న ప్రచారం గురించి మాట్లాడారు.చంద్రబాబు అలా చెప్పలేదని స్పష్టం చేయడంతో పాటు అసెంబ్లీ కి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని చెప్పారు.మున్సిపల్ ఎన్నికలు మాత్రం జరిపే అవకాశం ఉందన్నారు.

భారత్ లాంటి దేశంలో “ఒకే దేశం..ఒకే ఎన్నిక”అన్నది సాధ్యం కాకపోవచ్చని లోకేష్ అభిప్రాయపడ్డారు.ఈ మాటలు బయటికి రాగానే స్వీట్ నోట్లో వేసుకుంటే హాట్ టేస్ట్ తగిలినట్టైంది జగన్ పరిస్థితి.