సోనియా ఫోన్ ..నారాయణ స్వామి ఔట్

Posted November 29, 2016

Image result for narayana swamy

ముఖ్యమంత్రుల కమిటీలో తాను ఉండలేనంటు పుదుచ్ఛేరి సీఎం నారాయణస్వామి తప్పుకున్నారు మోదీ తీసుకున్న నిర్ణయాన్నిఅందరిపైనా రుద్దుతున్నారని కమిటీలోని సీఎంలు అభిప్రాయపడుతున్నారట. నారాయణస్వామి బాటలోనే మరికొందరు ఉన్నారట సమస్యలు మోదీ సృష్టించి, పరిష్కారాలు తమను అడగడమేమిటంటూ కాంగ్రెస్ సహ పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమం లోనే సోనియా గాంధీ ఫోన్ చేయటం తో నారాయణ స్వామి తప్పుకున్నట్లు సమాచారం .

పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన సమస్యలను తొలగించడమే కాకుండా ప్రజలకు సత్వరంగా నగదు అందించడానికి, నగదు రహిత లావాదేవీల కోసం అవలంబించాల్సిన పద్ధతులను సూచించడానికి కేంద్రం ముఖ్యమంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, పుదుచ్చేరి సీఎం పి.నారాయణస్వామి, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌లు ఉంటారని జైట్లీ చెప్పిన విషయం తెలిసిందే .