పెళ్లి కాకుండానే అన్నీ కానిచ్చేస్తున్న చంద్రకళ!!

Posted December 2, 2016

Image result for nayanthara vignesh shivan living together
అదుర్స్ సినిమాలో చంద్రకళ క్యారెక్టర్ లో దుమ్మురేపింది నయనతార. ఎన్టీఆర్ ను వెంటాడి ప్రేమించే పాత్రలో ఒదిగిపోయింది. రీల్ లైఫ్ లోనూ కాదు రియల్ లైఫ్ లోనూ దాదాపు అదే ఫిలాసఫీని ఫాలో అవుతోంది నయన్. మొదట శింబుతో లవ్ స్టోరీని నడిపింది. ఎందుకనో అది ఎక్కువకాలం నిలవలేదు. ఆ తర్వాత ప్రభుదేవాతో జత కలిసింది. అది పెళ్లి వరకు వెళ్లిపోయింది. కానీ అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ప్రేమ ప్రయత్నం చేసింది నయనతార. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట.

విఘ్నేశ్ శివన్ తో ప్రేమే కాదు ఇంకా చాలా చేసేస్తోందట నయనతార. చెన్నైలోని ఎగ్మూర్ లో ఇటీవల ఆమె ఇల్లు కొన్నదని సమాచారం. అయితే ఈ ఇద్దరు ప్రేమికులు ఇప్పుడు ఒకే ఇంట్లో కనిపిస్తున్నారట. అంతేకాదు ఇద్దరూ కలిసి ఓనమ్ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారని చెబుతున్నారు. ఇద్దరి మధ్య లవ్ కంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉందని ప్రచారం జరుగుతోంది. నయన్- విఘ్నేశ్ శివన్ ఒకే కప్పు కింద ఉండడంతో సహజీవనం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గుట్టుగా అన్నీ కానిస్తున్న నయన్- విఘ్నేశ్ ఈ రిలేషన్ పై బహిరంగంగా ఇప్పటివరకు ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. కానీ ఈ ఇద్దరి లివ్ ఇన్ రిలేషన్ షిప్ పెళ్లి వరకు వెళ్తుందా అన్నది చూడాలి. అయితే నయన్ జోరును చూస్తుంటే డైరెక్టర్ గారితో పెళ్లి ఖాయమంటున్నారు ఆమె సన్నిహితులు.