నయీం గుట్టు రట్టు..?

 nayeem gang details out

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ గుట్టును.. ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెడుతోంది. ఆస్తుల వివరాలు తెలపాలంటూ… జిల్లాల రిజిస్ట్రార్లకు సిట్ లేఖ రాసింది. నయీం ఆస్తులు, అనుచరులపై దాడులు కొనసాగించిన పోలీసులు.. మరింత కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశామని.. సిట్ చీఫ్.. ఐజీ నాగిరెడ్డి చెప్పారు. నయీం భార్యతో పాటు.. అతని అనుచరులను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నామన్నారు.నయీం కేసులో ఎంతటివాళ్లు ఉన్నా.. వదిలేది లేదన్నారు.. హోం మంత్రి నాయిని. నయీంతో ఎవరెవరికిసంబంధాలున్నదీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఇక.. నయీం ఆస్తులపై పోలీసులు మరింత విస్తృతంగా సోదాలు కంటిన్యూ చేశారు. అలకాపురి కాలనీలో ఉన్న నయీమ్ ఇంటి వర్కర్లు ఫర్హానా, అఫ్షాలను రాజేంద్రనగర్ పోలీసులు విచారించారు. నయీమ్ ఆర్థిక లావాదేవీలు… సెటిల్ మెంట్లు… అన్నింటికీ సంబంధించిన ఫైల్స్ మెయిన్ టెయిన్ చేసింది ఫర్హానానేని తేల్చారు. గోవాలో గెస్ట్ హౌజ్ కూడా ఫర్హానా పేరుమీదే ఉన్నట్టు గుర్తించారు. ఓటర్ ఐడీలు… 250 మొబైల్ ఫోన్లు… 2కోట్ల క్యాష్ .. ఇవన్నీ ఎక్కడినుంచి వచ్చాయన్నది తేల్చే పనిలో ఉన్నారు.

గోవాలో నయీం గెస్ట్ హౌజ్ వాచ్ మెన్ తాజుద్దీన్ ను నార్సింగి పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తాజుద్దీన్ కు ఉప్పర్ పల్లి స్పెషల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. నయీమ్ అనుచరుడు శ్రీధర్ గౌడ్, డ్రైవర్ బలరాంలను హయత్ నగర్ ఏడవ నెంబర్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. చార్జిషీట్ లో ఏ3గా శ్రీధర్ గౌడ్, ఏ9 గా బలరాం పేర్లను చేర్చారు పోలీసులు. సోదాలు కంటిన్యూ చేయడంతో పాటు.. కస్టడీలో ఉన్న నిందితుల నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టేలా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో తేలిన మరిన్ని వివరాలను.. రిమాండ్ రిపోర్ట్ లో ఉంచారు.

మరోవైపు ఎన్ కౌంటర్ కు సంబంధించి కొన్ని విజువల్స్ బయటకొచ్చాయి. ఎన్ కౌంటర్ స్పాట్ లో కాల్పుల తర్వాత పోలీస్ బృందాలు నయీం టీం దగ్గరకు వెళ్లాయి. నయీం స్పాట్ డెడ్ అని నిర్ధారించుకున్న తర్వాత.. అతని పక్కనే పడి ఉన్న ఇద్దరిని కూడా పరిశీలించారు. వాళ్లిద్దరూ ప్రాణాలతో ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు.. సోదాల్లో నయీమ్ వద్ద అత్యాధునిక సోదాలు లభించడం, భారీ మొత్తంలో నగదు, విలువైన డాక్యుమెంట్స్, పలువురు బినామీల పేర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సంభాషణల వివరాలు లభించిన తరుణంలో ఆ కోణంలో సిట్ దరాప్తును మొదలుపెట్టనుంది. నయీమ్ సామ్రాజ్యం విస్తరించిన నాటి నుంచి అతనికి సహకరించిన రాజకీ య నాయకులు, పోలీసు అధికారులపై విచారణను తొలత ఆరంభించాలని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు నయీమ్‌కు చెందిన విల్లాలు, ఫామ్‌హౌస్‌లు, ఇతర ఆస్తులపై దాడుల చేయాలని సిట్ భావిస్తోంది.