నేను లోకల్ రివ్యూ

 

Posted February 3, 2017

చిత్రం: నేను లోకల్
తారాగణం: నాని, కీర్తిసురేష్‌, న‌వీన్‌చంద్ర‌, పోసాని కృష్ణ‌ముర‌ళి,  ఈశ్వ‌రిరావు,  రావు ర‌మేష్‌

సంగీతం: దేవిశ్రీప్ర‌సాద్‌ 

ఛాయాగ్రహణం: నిజార్ ష‌ఫీ

కథ, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ 

రచన : సాయి కృష్ణ 
నిర్మాత: శిరీష్ 

సమర్పణ: దిల్‌రాజు 

 స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన

విడుద‌ల‌ తేదీ: 3-02-2017

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణగాడివీర ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మ‌న్‌, మజ్ను వంటి వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘నేను లోకల్’. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. విడుదలైన ఆడియో సాంగ్స్, ట్రైలర్స్, టీజర్స్ ఆ హైప్ ను మరింత పెంచాయి. నిజానికి ఈ సినిమా డిసెంబర్ లోనే  విడుదల కావాల్సినా పెద్ద నోట్ల రద్దు, పెద్ద హీరోల సినిమా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. డిఫరెంట్ సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్న  నాని ఈ సినిమాతో  మరో విజయం అందుకున్నాడో లేదో చూద్దాం.

ఇక కధలోకి వెళ్తే..

ఈ సినిమాలో నాని..  బాబుగా,  కీర్తిసురేష్‌.. కీర్తిగా, నవీన్‌ చంద్ర… సిద్ధార్థ వ‌ర్మ‌గా నటించారు.

ఇంజరీనింగ్ చదవడానికి నానా పాట్లూ పడుతూ ఎట్టకేలకు ఒక ఇన్విజీలేటర్ సహాయంతో కాపీ కొట్టి ఇంజనీరింగ్ పాసవుతాడు బాబు. అదే సమయంలో కీర్తిని తొలిసారి చూడగానే మనసు పారేసుకుంటాడు. తన ప్రేమ విషయం చెబితే అందుకు కీర్తి నో చెబుతుంది. ‘నువ్వు ప్రేమించే వరకూ విసిగిస్తా’నని బాబు ఆమె వెంటపడుతుంటాడు. కీర్తి కూడా బాబుతో ప్రేమలో పడే సమయానికి ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న బాబు ఆమెను కాపాడేందుకు వెళతాడు. అయితే  అక్కడ అప్పటికే  పోలీస్‌ అధికారి సిద్ధార్థ వ‌ర్మ‌ రౌడీల బారి నుండి ఆమెను కాపాడతాడు. కీర్తిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆమె  జోలికి ఎవరైనా వస్తే చంపేస్తానంటూ వార్నింగ్‌ ఇస్తాడు. మరో పక్క బాబు కంటే ఉద్యోగం, పరపతి రెండూ ఉన్న సిద్దార్ధ్ వర్మకే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని కీర్తి తండ్రి ఫిక్స్ అవుతాడు. బాబు, కీర్తిల ప్రేమ సక్సెస్ అయ్యిందా.. లేక తండ్రి కోరిక మేరకు కీర్తి సిద్దార్ధ వర్మను పెళ్లాడిందా.. అసలు   పోలీస్‌ అధికారి సిద్ధార్థ వ‌ర్మ‌ కథ ఏమిటి .. అనే ఆసక్తికర విషయాలను వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక కధనం ఏంటంటే:

చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ అన్నింటినీ లైట్ గా తీసుకుని తాను అనుకున్నదే చేసే ఓ కుర్రాడు తన లవ్ ని ఎలా గెలుచుకున్నాడు అనేదే నేను లోకల్ సినిమా. ఫస్టాఫ్ సినిమా మొత్తం నాని పాత్ర చుట్టూ తిరుగుతూ, సరదా సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది.అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత ఫన్, స్పీడ్ సెకండాఫ్ లో లేకపోవడంతో సాగదీసినట్లు అనిపిస్తుంది.

ఎవరు ఎలా చేశారో విందాం:

నాని ‘నేచురల్ స్టార్’ అన్న తనకు లభించిన బిరుదుకు తగ్గట్లుగా సహజమైన నటనకి కాస్త యాటిట్యూడ్‌ను జోడించి ‘బాబు’ పాత్రను రంజింపజేశాడు. కీర్తి సురేష్‌ తన గ్లామర్ తో  అలరించింది. నవీన్ చంద్ర పాత్ర నిడివి చాలా చిన్నది కావడం, క్యారెక్టర్‌ను పెద్దగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వంటి కారణాల వల్ల సినిమాలో  సైడ్ క్యారెక్టర్‌లా మిగిలిపోయాడే కానీ పెద్దగా ఇంపాక్ట్ తీసుకురాలేకపోయాడు. ప్రసన్నకుమార్‌ మాటలు, త్రినాథరావు దర్శకత్వం ఆకట్టుకుంటాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్లస్ పాయింట్స్ : 
 నాని, కీర్తిసురేష్‌ ల నటన

కామెడీ, పంచ్ డైలాగ్స్ 
 దేవిశ్రీ సంగీతం

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

సెకండాఫ్ స్లో నారేషన్

ఆఖరిపంచ్: కధలేకపోయినా యాటిట్యూడ్ తో ‘లోకల్’ కుర్రాడు బానే ఆకట్టుకున్నాడు.

Telugu Bullet Rating: 3.25/5