ఏపీ ఎంసెట్ లో కొత్త ట్విస్ట్

0
77

Posted April 24, 2017 at 14:35

new twist in ap eamcetనిమిషం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారిందని విద్యావేత్తల నుంచి వస్తున్న విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎంసెట్ కు నిమిషం నిబంధనలో సడలింపులు ఇచ్చింది. సహేతుక కారణం చెబితే విద్యార్థిని పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. కానీ ఇదే కారణంతో అలసత్వం ప్రదర్శిస్తే మాత్రం కనికరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది. గత ఏడాది కూడా నిమిషం నిబంధనపై చర్చ జరగడం, విమర్శలు రావడంతో.. ఈసారి ఏపీ సర్కారు ముందే ప్రకటన చేసింది.

విద్యార్థులకు సమయపాలన అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారు. పైగా పావుగంట మినహాయింపు ఇస్తే.. విద్యార్థుల్ని అనుమతించినా.. వారికి తోటి విద్యార్థుల కంటే తక్కువ టైమ్ దొరుకుతుందన్న వాదనతో ఏకీభవించి ఈ నిబంధన తీసుకొచ్చరు. కానీ నిమిషం నిబంధన పేరుతో గేట్లు వేయడం, విద్యార్థుల్ని తోసేడయం జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాల్ టికెట్లపై తప్పుడు అడ్రెస్ లు ముద్రించడం, సెంటర్లలో సరైన గైడెన్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు లేటౌతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నాయి.

అందుకే ఈసారి ఎంసెట్ విమర్శలకు తావివ్వకుండా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సహేతుక కారణం చెబితే పరీక్షకు అనుమతిస్తామని ప్రకటించడంతో.. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అసలు టైమంటే టైమే. టైమ్ ప్రకారం పరీక్షకు రావాలని ఎవరూ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ జామ్ లు అనేవి రోజూ ఉండేవే. అయితే విద్యార్థి స్కూలుకు చాలా దూరంగా సెంటర్ కేటాయించడం, హాల్ టికెట్ ప్రింటింగ్ మిస్టేక్స్ పరిహరిస్తే లేట్ కమింగ్స్ తగ్గుతాయనే వాదన కూడా ఉంది.