గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మెగాడాటర్..!!

Posted February 16, 2017

Niharika Pair Up With kollywood star vijay next movieమెగాడాటర్ నిహారిక ఒకమనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫట్ అయినా ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చినా ఆమె మాత్రం ఏ సినిమాకి ఎస్ చెప్పలేదు. అయితే తాజాగా  ఆమె ఓ కోలీవుడ్ సినిమాకి  కమిట్ అయ్యినట్లు సమాచారం. అది కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించబోతోంది.

అరుముగ కుమార్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో విజయ్ , నిహారిక జంటగా నటించబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మరో యంగ్ హీరో గౌతమ్ కార్తిక్ కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. మరి టాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరచిన నిహారిక తమిళ తంబిలను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.