నిఖిల్ ఫస్ట్ లుక్ అదిరింది..

Posted December 23, 2016

nikhil first look super
ఎక్కడికిపోతావు చిన్నవాడా తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నిఖిల్ తరువాత అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తున్నాడు.ఈసారి నిఖిల్ కేశవ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా కధ,కధనాలు వినూత్నంగా వుంటాయని తెలుస్తోంది.ఆషామాషీ సినిమాలు చేస్తే కుదరదని డిసైడ్ అయిపోయిన నిఖిల్ కొత్త సినిమాల విషయంలో ఎన్నో విధాలుగా ఆలోచించి నూతనత్వం ఉంటేనే ఓకే చేస్తున్నాడు. కేశవ ఫస్ట్ లుక్ కూడా నిఖిల్ ప్రయత్నానికి అద్దం పట్టేలా వుంది.
మిస్టరీ ద్రిల్లర్ గా సాగే కేశవ ఫస్ట్ లుక్ ని బాలీవుడ్ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ తెగ పొగిడారు. ప్రతీకారం ఓ వంటకం …దాన్ని చల్లగా వడ్డించడం మంచిదనే క్యాప్షన్ తో కేశవ ఫస్ట్ లుక్ తీర్చిదిద్దారు. మీరు కూడా ఆ ఫస్ట్ లుక్ చూసి ఎంజాయ్ చేయండి..