నితిన్‌ పెద్ద సాహసమే చేయబోతున్నాడా?

Posted April 21, 2017 at 11:24

nithin do big Adventure for lie movie
‘అఆ’ చిత్రానికి ముందు వరకు నితిన్‌ ఒక చిన్న హీరో. అయితే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ సినిమాతో నితిన్‌ ఒక్కసారిగా భారీ హీరోగా మారిపోయాడు. ‘అఆ’ చిత్రం తర్వాత నితిన్‌ నటిస్తున్న సినిమా ‘లై’. 14 రీల్స్‌ బ్యానర్‌లో హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్‌ విభిన్నంగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నితిన్‌ ఈ సినిమా కోసం పెద్ద సాహసమే చేస్తున్నాడట. అదేంటి అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. డిఫరెంట్‌ లుక్‌తో పాటు విభిన్న కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. నితిన్‌ కెరీర్‌లో ‘అఆ’ చిత్రం తర్వాత అతి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం విశేషం. నితిన్‌ కెరీర్‌లో ఇదో విభిన్న సినిమాగా నిలుస్తుందని దర్శకుడు హను రాఘవపూడి నమ్మకంగా చెబుతున్నాడు. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో హనురాఘవపూడి సక్సెస్‌లు అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమాతో హ్యాట్రిక్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.