డిజిటల్ పే.. లక్కీ డ్రా ..

0
37

Posted December 16, 2016

NITI Aayog launches schemes to promote digital transactionsఇంతవరకు మనం ప్రైవేట్ దుకాణాల్లో లేదా దసరా, సంక్రాంతి , దీపావళి పండుగ దినాల్లో ఆఫర్స్ ఇస్తూ అమ్మకాలు పెంచుకునేందుకు లక్కీ డ్రా పద్దతులను చూసాం ఐతే తాజా గా ప్రభుత్వం కూడా ఈ బాట పట్టింది. డిజిటల్ పద్దతి ద్వారా పే చేస్తే డ్రా తీస్తాం అని విజేతలకు బహుమతులు ఇస్తానని చెప్తోంది అదేమిటో చూద్దాం ……

ప్రభుత్వం పేర్కొన్న డిజిటల్‌ పద్ధతుల్లో బిల్ ప్రెమెంట్స్ చేయటం కోసం ప్రభుత్వం రెండు లక్కీ డ్రా పథకాలను ఇంట్రడ్యూస్ చేస్తోంది ఈ లక్కీ డ్రా లో వందరోజుల పాటు కొనసాగే ఈ పథకాల కింద మొత్తం రూ.340 కోట్ల విలువైన నగదు బహుమతులను పంపిణీ చేస్తుందట. క్రిస్మస్‌ పండుగనుంచి ఏప్రిల్‌ 14వరకు లక్కీడ్రాలు కొనసాగుతాయి.అని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌కాంత్‌ అంటున్నారు..

లక్కీ గ్రాహక్‌ యోజన:
* ఈ పథకం వినియోగదారులకు ఉద్దేశించింది. వందరోజులపాటు ప్రతి రోజూ 15వేల మంది అదృష్ట వినియోగదారులను డ్రాద్వారా ఎంపిక చేసి ఒక్కోరికి రూ.వెయ్యి బహుమతి ఇస్తారు.
* వారానికోసారి 7వేలమందికి డ్రా తీసి రూ.లక్ష, రూ.10వేలు, రూ.5వేలు బహుమతిగా అందిస్తారు.
* రూ.50 నుంచి రూ.3వేలలోపు లావాదేవీలు చేసేవారే ఇందుకు అర్హులు.
* రూపేకార్డు, యూపీఐ, ఎస్‌ఎస్‌ఎస్‌డీ, ఆధార్‌ ఆధారిత చెల్లింపులు జరిపేవారికి మాత్రమే ఈ ప్రోత్సాహకాలు ఇస్తారు. వీసా, మాస్టర్‌కార్డులు, ప్రైవేటు కంపెనీల ఈ-వ్యాలెట్లు వాడే వారు ఈ పథకాల పరిధిలోకి రారు. అలాగే వ్యక్తులమధ్య జరిగే లావాదేవీలు, ఒక బ్యాంకు ఖాతానుంచి మరోబ్యాంకు ఖాతాకుచేసే ఆన్‌లైన్‌ బదిలీలకూ ఇదివర్తించదు.

డిజి-ధన్‌ వ్యాపారి యోజన…
* డిజిటిల్‌ పద్ధతిలో లావాదేవీలు జరిపే వ్యాపారులకు ఈ పథకం వర్తిస్తుంది.
* ప్రతివారం డ్రా నిర్వహించి 7వేల మందికి రూ.50వేలు, రూ.5వేలు, రూ.2,500 ఇస్తారు.
ఈ పథకాలను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతినాడు ముగించనున్నారు. ఆ సందర్భంగా మెగా డ్రా నిర్వహిస్తారు. వినియోగదారుల్లో ప్రథమ విజేతకు రూ.కోటి, రెండో విజేతకు రూ.50 లక్షలు, మూడో విజేతకు రూ.25 లక్షలు అందిస్తారు.
* వ్యాపారులకు మొదటి బహుమతి కింద రూ.50లక్షలు, రెండో బహుమతికింద రూ.25 లక్షలు, మూడో బహుమతికింద రూ.5 లక్షలు అందిస్తారు. నవంబర్‌ 8 నుంచి ఏప్రిల్‌ 13వరకు జరిపిన డిజిటల్‌ లావాదేవీలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటారు.
* ఆధార్‌ ఆధారిత లావాదేవీలు, వినియోగదారులు-వ్యాపారులు, వినియోగదారులు-ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన రూ.50 నుంచి రూ.3వేలోపు డిజిటల్‌ లావాదేవీలను ఈ పథకాల కింద పరిగణనలోకి తీసుకుంటారు.
* లావాదేవీల గుర్తింపు సంఖ్య (ట్రాన్షాక్షన్‌ ఐడీ) ఆధారంగా విజేతలను ర్యాండం డ్రా ద్వారా ఎంపికచేస్తారు. ఇందుకోసం ఎన్‌సీపీఐ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిచేయనుంది.
* డిజిటల్‌ లావాదేవీలకు మళ్లని పేద, మధ్యతరగతివర్గాలను ప్రోత్సహించేందుకు రూపేకార్డులు, యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ, ఆధార్‌ఆధారిత చెల్లింపులను మాత్రమే డ్రాలోకి తీసుకుంటున్నారు.