ఆమె ప్రశ్నలకి రోజా దగ్గర జవాబుందా?

Posted November 8, 2016

no answer from roja to yamini sadhineni questions
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నోటికి బ్రేక్ వేసే వాళ్ళు ఎవరైనా వుంటారా? బోండా ఉమాలా పరుష వ్యాఖ్యలతో కౌంటర్ చేయడం కాకుండా పాయింట్ టు పాయింట్ రోజా దూకుడికి అడ్డుకట్ట వేసే వాళ్ళ కోసం టీడీపీ ఎప్పటినుంచో గాలిస్తోంది.ఇప్పటికి వారి ప్రయత్నం ఎందాక వచ్చిందో కానీ వైజాగ్ బీచ్ ఫెస్టివల్ గురించి టీవీ చర్చల్లో ఓ మహిళా పారిశ్రామిక వేత్త మాత్రం అదరగొట్టారు.ఆమె పేరు యామిని సాదినేని.ఆమె రోజాకి సంధించిన ప్రశ్నలు ఇవే ..

1. బీచ్ ఫెస్టివల్ నిర్వహణని విమర్శించే ముందు తాను నటించిన సినిమాల్లో పాత్రలు,దుస్తుల గురించి రోజా జవాబేమిటి?
2.మీరు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారా లేదా ?
3 . మీరు జడ్జి గా ఉన్న జబర్దస్త్ సహా టీవీ ప్రోగ్రామ్స్,సినిమాల్లో అసభ్యత ఉందా..లేదా?వాటిని జనం చూడడం లేదా?
రోజాకి ఈ ప్రశ్నలు వేసిన యామిని బీచ్ ఫెస్టివల్ నిర్వహణ గురించి మంచి వివరణ కూడా ఇచ్చారు.వివిధ దేశాల సంస్కృతుల గురించి తెలుసుకోడానికి ఇలాంటి పండగలు ప్రపంచమంతా నిర్వహిస్తారని …అది తెలుసుకోకుండా చెడునే చూస్తే ఎలా అని యామిని అభిప్రాయపడ్డారు.మొత్తానికి యామిని వ్యవహారశైలి,ప్రెజెంటేషన్ చూస్తే నోరు పారేసుకోకుండానే రోజాకి కౌంటర్ ఇచ్చే సమర్ధురాలు దొరికినట్టే వుంది.