50 ,100 నోట్ల రద్దు లేదు..

POSTED[RELATIVEDATE]

 

 

currency

500 ,1000 నోట్ల రద్దుతో పాటు 50 ,100 నోట్లను కూడా త్వరలో రద్దు చేస్తున్నారని ప్రచారం జరుగు తున్న నేపధ్యం లో , ప్రజల్లో ఉన్న ఈ కన్ఫ్యూషన్ ని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్రసార మాధ్యమాలు, వాట్స్ అప్ వంటి వాటిలో వస్తున్న వాటిలో నిజం లేదని ఇంతవరకు 50 ,100 నోట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. వెయ్యి రూపాయల నోటును మరలా చలామణిలోకి తీసుకొచ్చే అవకాశం లేదని ఆర్థిక శాఖ ప్రకటించింది. 500 రూపాయల నోటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో ఆరు నెలలు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.