ఆ డ్రెస్ లు వేసుకొస్తే దేవుడిని చూడనివ్వం..

Posted November 30, 2016

Image result for padmanabhaswamy

సాంప్రదాయ వేష ధారణ , చీరలు ధరించి వస్తే తప్ప ఆలయం లోకి అనుమతించమని కేరళ లోని త్రివేండ్రం అనంత పద్మనాభ స్వామి ఆలయ అధికారులు తెగేసి చెబుతున్నారు. తాజా గా చుడి దార్ వేసుకొన్న మహిళలు కొందరు ఆలయం లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నారు ఆలయ సిబ్బంది . కోర్ట్ అనుమతించిన మీరెందుకు అడ్డుకొంటున్నారని మహిళలు నిరసన కి దిగారు ..ఆలయ ఈ ఓ మాట్లాడుతూ కోర్ట్ ఆర్డర్స్ వున్నా అవి స్పష్టం గ లేవని అందుకే అడ్డుకొంటున్నాం అని,మరో సారి సమీక్ష చేస్తే తప్ప అనుమతి ఇవ్వం అని చెప్పారట , ఆ శాఖ మంత్రి మాట్లాడుతూ అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకొంటే అని అన్నారు . ఈ చిచ్చుకు కారణం సామజిక కార్యకర్త రియా అట ఆవిడే కోర్ట్ కి వెళ్లిందట ఫస్ట్ ..