గోవా లో డబ్బు పనిలేదు….

Posted November 27, 2016

no need of currency in goaగోవా: అసలు డబ్బు అవసరం లేకుండానే పనులు చక్కబెట్టుకునే రోజులు వస్తున్నాయా? అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా భారత్‌లో కూడా అతి త్వరలోనే పూర్తిగా డెబిట్‌, క్రెడిట్‌, షాపింగ్‌ తదితర కార్డుల ద్వారానే అవసరాలు తీర్చుకునే అవకాశం రానుందా.. అంటే అవుననే తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే.. ఈ విషయంలో గోవా ముందంజలో ఉందట. పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా అల్లాడుతుంటే అసలు డబ్బుతో పనిలేకుండానే తమ పనులు చక్కబెట్టుకునే రికార్డు దిశగా గోవా ముందుకు వెళుతోంది.

డిసెంబర్‌ 31 తర్వాత గోవా రాష్ట్రంలో అసలు డబ్బుతో పనిలేకుండా పూర్తిగా కార్డుల ద్వారానే ఎలాంటి వస్తువునైనా కొనుగోలు చేసుకునే పరిస్థితులు రానున్నాయట. ఇదే జరిగితే దేశంలో డబ్బు లేకుండానే పనులు చక్కబెట్టుకునే రాష్ట్రంగా గోవాల నిలవనుంది. మాంసం, చేపలు, కూరగాయలు, చిన్న వస్తువులు ఏం కొనుగోలు చేయాలన్న వినియోగదారులు కేవలం తమ ఫోన్లను ఉపయోగిస్తే సరిపోతుందట. మొబైల్‌ ఫోన్‌ల కిచ్చే అప్షన్‌ ల ద్వారా వారికి కావాల్సినవి పొందనున్నారు.

‘గోవాలోవేం కొనుగోలు చేయాలన్నా బహుషా త్వరలోనే డబ్బు అవసరం ఉండకపోవచ్చు. మొబైల్‌ ద్వారానే అన్ని రకాల కొనుగోళ్లు జరిగే పరిస్థితి రాబోతుంది. వారి కొనుగోళ్లకు సంబంధించి నేరుగా బ్యాంకు నుంచి డెబిట్‌ అయిపోతుంది’ అని అక్కడి చీఫ్‌ సెక్రటరీ ఆర్కే శ్రీవాత్సవ తెలిపారు. ఇందుకోసం స్మార్ట్‌ ఫోన్లు అక్కర్లేదని, సాధారణ ఫోన్‌ తోనైనా స్టార్‌ 99 యాష్‌ డయల్‌చేసి అందులో వచ్చే సూచనలు ఫాలో అయితే సరిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమం రాష్ట్రమంతటా సోమవారం ప్రారంభిస్తామని వివరించారు.