శశికి పట్టెడన్నం లేదు ….హోటళ్లకు బేరం లేదు

0
115

Posted April 27, 2017 at 12:25

no one meets sasikala in jail then she is worried
అమ్మ తర్వాత చిన్నమ్మగా అవతరించిన శశికళ జీవితంలో ఊహించని మలుపు.కాలచక్రం గిర్రున తిరిగింది.అంతా తల్లకిందులైంది.దేశమంతా మోడీ కి పోటీ లేని పరిస్థితుల్లో ఆయన వ్యూహాన్ని,అధికార బలాన్ని,బలగాన్ని తట్టుకుని తమిళనాట పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది శశికళ.ఓ రెండు నెలల కిందట మోడీ వ్యూహాన్ని చిత్తుచిత్తు చేసిన ఆ శశికళ ఇప్పుడు ఒంటరైంది.జైలులో పలకరించే దిక్కేలేనిదానిలా మిగిలిపోయింది.అంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకోటుంది.ఆమె కోర్టుకి వెళ్లి మరీ బయటనుంచి భోజనం తెప్పించుకునేందుకు ఆదేశాలు తెప్పించుకోగలిగింది.దానికి తగ్గట్టు బెంగళూరు లో నివాసం ఉంటున్న ఓ అన్నాడీఎంకే నేత ఇంటి నుంచి క్యారేజ్ వచ్చేది.కానీ ఒక్క మాట అయినా చెప్పకుండా ఆ క్యారేజ్ పంపడం మానేసాడు సదరు నాయకుడు.రాజకీయాలు ఎలా వుంటాయో,ఎంత కఠినంగా వుంటాయో చెప్పేందుకు ఇంతకు మించిన సాక్ష్యం ఉంటుందా?

బయట నుంచి పట్టెడన్నం తెచ్చేవాళ్ళు లేరు,ఇక జైలుకొచ్చి పలకరించే వాళ్ళు అంతకన్నా లేరు.అన్నాడీఎంకే లో శశికళకు కాదు ఆమె ఫోటోకి కూడా స్థానం లేదు.తమిళనాట ఇంకొన్నాళ్ళు పోతే ఆమెని తిట్టుకోడానికి కూడా గుర్తుంచుకునే వాళ్ళు వుంటారో ,లేదో?తనకు కనీసం పట్టెడన్నం పెట్టే వాళ్ళు వుండరన్న వాస్తవాన్ని జైల్లో వున్న శశికళ జీరించుకోలేకపోతోంది.అందుకే జైలు సిబ్బంది,డాక్టర్లు మొత్తుకుంటున్నా ఒక్క మెతుకు తినడానికి కూడా ఆమె మనసు ఒప్పడంలేదు.జైలు డాక్టర్లు బలవంతం చేసినా శశికళ తో టైం కి ఆహారం తీసుకునేలా చేయలేకపోతున్నారు.ఆమెకు అసలే బీపీ,షుగర్.ఇక ఒత్తిడి గురించి చెప్పక్కర్లేదు.ఈ పరిస్థితుల్లో ఆమెని అనునయించే వాళ్ళు కూడా లేరు.ఆమె అన్నం తినడం లేదన్న వార్త కన్నా…శశికళని పలకరించే వాళ్ళు తగ్గిపోవడంతో బెంగళూరు,అగ్రహార ప్రాంతంలో హోటల్స్,లాడ్జి లకి డిమాండ్ తగ్గిందన్న దాని మీదే చర్చించుకున్న వాళ్ళే ఎక్కువ.అంతా కాల మహిమ.మనిషికి పట్టెడన్నం పెట్టడం కన్నా …ఆ పెట్టినందుకు వచ్చే డబ్బుకే విలువెక్కువ..మహామహులే ఈ కాలచక్రంలో గిర్రున తిరుగుతుంటే …శశికళ ఎంత ?