కొత్త రెండువేల నోట్ కు సెక్యూరిటీ లేదట ..!

Posted November 12, 2016

no security of new 2000 rupees noteపండగ నాడు కూడా పాత మొగుడేనా అన్న చందంగా  తయారైంది ప్రస్తుతం కరెన్సీ పంచాయతీ .ఇంకేముంది పాత 500 ,1000 నోట్లన్నీ రద్దు కొత్త వాటితో నల్ల ధనాన్ని అడ్డుకుంటాం అన్న కేంద్రం మాటలు నీటి మూటల్లా మారినట్టే కనిపిస్తోంది.

నకిలీ నోట్లకు చెక్ పెట్టేలా అత్యంత జాగ్రత్తగా డిజైన్ చేసిన ఈ తాజా నోట్లలో అదనపు సెక్యూరిటీ ఫీచర్స్ పొందుపరచలేదన్న వార్త కలకలం రేపుతోంది. సరిపడా సమయంలేక భద్రతా లక్షణాలను పాత రూ. 500 నుంచి రూ. 1,000 నోట్ల మాదిరిగా ఉంచినట్టు సీనియర్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు .హై సెక్యూరిటీ ఫీచర్స్ ను జోడించడానికి పెద్ద కసరత్తు చేయాల్సి వస్తుందని, కనీసం ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం పడుతుందని ఆయన వివరించారు. ఇలాంటి ప్రయోగాన్ని 2005 లో చేపట్టారట. వాటర్ మార్క్స్, సెక్యూరిటీ థ్రెడ్, ఫైబర్, లాంటి భద్రతా ఫీచర్స్ చేర్చడానికి అనేక అనుమతులతో పాటు క్యాబినెట్ ఆమోదం అవసరమట .

పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు గురించి మాట్లాడుతూ .డిజైన్ మాత్రమే మార్చబడింది తప్ప భద్రతా లక్షణాలు అలాగే ఉన్నాయన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ ముద్రణాలయంలో నకిలీ నోట్లు ప్రింట్ అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మొత్తంగా  మార్పేమి ఉండదేమో ..?