IBM లో ట్రంప్ చిచ్చు..

0
64

Posted November 30, 2016Image result for ibm ceo rometty in america

ఉద్యోగుల మనోభావాలకు గౌరవం లేని చోట పని చేయ లేమని అంతే కాకుండా మనోభావాల్ని గుర్తించకుండా కించ పరిచేలా యజమానులు వ్యవహరించటం సరి కాదని ఇందుకు నిరసనగా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా అని ఐబీఎం సీఈవో రొమెట్టికి ఓ ఉద్యోగిని షాక్‌ ఇచ్చింది. ఇటీవల అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నిక కావడం పట్ల నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అదే సమయంలో మరికొందరు తమ మద్దతునూ తెలియజేశారు. ఐబీఎం సీఈవో రొమెట్టి ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. అధ్యక్షుడిగా ఎన్నికవ్వడాన్ని అభినందించడమే కాకుండా..

ఆయన విధానాలతో తాము ఏకీభవిస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం, వలసవాదులు, లాటిన్‌ అమెరికన్ల పట్ల ట్రంప్‌ అనుసరించనున్న విధానాలనే తమ కంపెనీలో అనుసరిస్తామని లేఖలో పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చే చర్యలో తాము తోడ్పాటునందిస్తామని ఆమె పేర్కొన్నారు.అయితే, ట్రంప్‌ విధానాలకు తమ సీఈవో మద్దతు పలకడాన్ని సహించలేని కంపెనీలోని సీనియర్‌ ఉద్యోగిని అయిన ఎలిజబెత్‌ వుడ్‌ తన ఉద్యోగానికి ఇటీవల రాజీనామా చేస్తూ బహిరంగ లేఖ రాసింది