మార్కెట్ లో కి మళ్ళీ నోకియా మొబైల్స్…

Posted December 2, 2016

Image result for nokia latest upcoming mobile

 

నోకియా మొబైల్ రంగాన్ని ఒక ఊపు ఊపి ఉన్నట్టుండి ,స్మార్ట్ ఫోన్ల దెబ్బకి కుదేలైపోయే చివరకు యూనిట్ లను అమ్ముకొని వెళ్లిపోయిన సంస్థ ఐనా ఈ బ్రాండ్ మీద అభిమానం ఉన్న వినియోగదారులు ఇంకా వున్నారు అనే చెప్పాలి. సెల్యూలర్ రంగం విస్తరిస్తున్న మొదటిలి సీమెన్స్, నోకియా ఈ రెండు బ్రాండ్ లను నోకియా మూన్ లైట్ ఫోన్ లని వాడిన వినియోగ దారులే ఎక్కువ ..కాలగమనం లో కలిసి పోయిన నోకియా మళ్ళీ కొత్త హంగుల్లో మార్కెట్ ను ఏలేందుకు సిద్ధం అవుతున్నట్టే కనిపిస్తోంది .

2017 తొలి అర్ధ భాగంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. తొలిరోజు నుంచే అమెరికా, యూరోప్‌, ఆసియా, మధ్య తూర్పు, ఆఫ్రికా, భారత్‌, చైనా తదితర ప్రాంతాల్లోని మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడతామని చెబుతాం.ప్రముఖ పరిశోధన సంస్థ ఐడీసీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం 1.45 బిలియన్లకు చేరింది. అదే విధంగా 0.6శాతం వృద్ధిని నమోదు చేయనుంది. మరోపక్క 4జీ మొబైల్‌ ఫోన్లకు భారత్‌లో మంచి మార్కెట్‌ ఉంది.