ఎన్నారై నోటు కష్టాలు

Posted November 17, 2016

nris

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఉండేవారితోపాటు ఇతర దేశాలకు వెళ్లినవారూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. వారిదగ్గర ఉన్న నోట్లు ఎలా మార్చుకోవాలి అనేదానిప తర్జనభర్జన పడుతున్నారు. అమెరికా, కెనడా, ఆస్ర్టేలియా, జపాన్‌, సింగపూర్‌, చైనా, గల్ఫ్‌ దేశాల్లో ఉన్న మన వాళ్ల దగ్గర భారీగానే సొమ్ములు ఉన్నట్లు తెలుస్తుంది. మరి వారికి దేశం ఆవల మార్చుకునే అవకాశం ఇవ్వలేదు. ఒక వేళ వాళ్లు నోట్లు మార్చుకోవాలంటే కచ్చింతగా భారత్‌లోని బ్యాంకులు, పోస్టాఫీసులే దిక్కు.. ఇతర దేశాల నుంచి నకిలీ నోట్లు వస్తాయని.. దానితోపాటు భారీగా అవకతవకలు జరిగే అవకాశం ముందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా దేశాల్లో మార్పిడికి సుముఖత చూపడం లేదు.

ఒక వేళ మన దేశ బ్యాంకుల బ్రాంచులు ఆయా దేశాల్లో ఉన్నా సరే అక్కడ మార్చేందుకు వీలుండదు.. దాని వల్ల కచ్చితంగా వారు ఇండియా రావడం లేదా వారు ధ్రువీకిరించిన పత్రంతో సన్నిహితు సాయంతో ఇక్కడ మార్చుకోవచ్చు.. ఒక్క గల్ఫ్‌ దేవాల్లోనే మన దేశానికి చెందిన 70 లక్షల మంది ఉన్నారు. వారి దగ్గర ఇండియా కరెన్సీ దాదాపు రూ.1400కోట్లు ఉంటుందని అంచనా.. అయినా వారి సొమ్ములు మార్చెందుకు ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. అక్కడి భారతీయ సంఘాల లెక్కల ప్రకారమే ఒక్కక్కర దగ్గర రూ.2 వేల నుంచి రూ.10 వేల మధ్య ఉన్నవారే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్‌లోనూ భారీగానే ఉన్నాయి వాటిని మార్చాలన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాలని భావిస్తుంది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న వారు నగదు మార్చుకోవడానికి తప్పనిసరిగా దేశానికి రావాల్సిందే లేదా ఎవరితోనైనా ఆ సొమ్ముని పంపి దానితోపాటు ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. రూ.2.5లక్షల కన్నా ఎక్కువ మారిస్తే వారి ఖాతలపైనా నిఘా ఉంటుంది. లెక్కలు సరిగా చూపిస్తే ఇబ్బంది ఉండదు.