తారక్ మళ్లీ రామ్ అవుతాడా?

 ntr accept ram reject movie
చిత్ర పరిశ్రమలో ఒకరితో అనుకున్న సినిమాలు ఇంకోరి దగ్గరికి వెళ్లడం కొత్త కాదు.ఒకరితో మొదలైన సినిమా మధ్యలో ఆగడం..ఇంకోరితో చేయడం కూడా చూశాం.ఇదే సీన్ ఇద్దరి మధ్య రిపీట్ కావడం మాత్రం అరుదు.కానీ ఎన్టీఆర్,రామ్ ల మధ్య ఇలాంటి ఘటన రెండో సారి జరిగే సూచనలున్నాయి.ఇంతకముందు బెల్లంకొండ సురేష్,సంతోష్ శ్రీనివాస్,రామ్ కాంబినేషన్ లో ఓ సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది.కట్ చేస్తే అదే ప్రాజెక్ట్ లోకి రామ్ బదులు హీరో గా ఎన్టీఆర్ ఎంటర్ అయ్యాడు.అదే రభస సినిమా.

ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కావచ్చనిపిస్తోంది.దిల్ రాజు,అనిల్ రావిపూడి,రామ్ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ అయ్యింది.రేపోమాపో షూటింగ్ అనుకున్న దశలో హీరో,నిర్మాత మధ్య ఏవో విభేదాలు వచ్చాయట.దీంతో రామ్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.ఇప్పుడు అదే కథని ఎన్టీఆర్ కి వినిపించారట.అయన ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ లోకి ఎన్టీఆర్ వచ్చేసినట్టే.కానీ ఇందులో హీరో కొంతసేపు అంధుడిగా ఉంటాడట.ఇటీవల కాస్త వెరైటీ పాత్రలకి మొగ్గు చూపుతున్న ఎన్టీఆర్ కూడా ఈ స్క్రిప్ట్ కి ఓకే అనే అవకాశముంది.అదే జరిగితే నిర్మాతగా దిల్ రాజు తో పాటు కళ్యాణ్ రామ్ కూడా జతకలవొచ్చని సమాచారం.