ఆ దర్శకులతో ఎన్టీఆర్,బన్నీ దాగుడుమూతలు..

Posted September 22, 2016

 ntr allu arjun play game directores vakkantham vamsi lingu swamy
వరస హిట్ లతో దూసుకుపోతున్న ఎన్టీఆర్,బన్నీ ఆ ఇద్దరు దర్శకులతో మాత్రం ఓ ఆట ఆడేసుకుంటున్నారు.అందులో ఒకరు స్టార్ రైటర్ వక్కంతం వంశీ,మరొకరు కోలీవుడ్ లో సూపర్ డైరెక్టర్ లింగుస్వామి.రచయితలకి తగిన గౌరవం దక్కడం లేదన్న కారణంతో మెగా ఫోన్ పట్టుకోవాలని వంశీ ఫిక్స్ అయినప్పటినుంచి ఎన్టీఆర్ తో మొదటి సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఓకే అని వార్తలు కూడా వచ్చాయి.జనతా గ్యారేజ్ హిట్ తరువాత టాప్ చైర్ మీద కన్నేసిన ఎన్టీఆర్ కొత్త దర్శకుడి చేతిలో ఇంత భారం మోపలేక డైలమాలో పడ్డారు.ఈ విషయం తెలిసిన బన్నీ పిలిచి మరీ వంశీ కథ విన్నాడు.దీంతో అప్పటిదాకా బన్నీ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న లింగుస్వామి ఎన్టీఆర్ దగ్గరకొచ్చి కధ చెప్పాడు.

ఇద్దరు హీరోలకి దర్శకులు తారుమారయ్యారని అంతా అనుకున్నారు.కొత్త కాంబినేషన్ సెట్ అవుతుందని భావించారు.ఇంతలో ఏమయ్యిందో ఏమిటో గానీ లింగుస్వామిని వెనక్కు పిలిపించుకున్న బన్నీ తాజాగా అయన సినిమా ఓకే చేసినట్టు తెలుస్తోంది.అది కూడా తెలుగు,తమిళ్ భాషల్లో చేస్తారట.దర్శకుడు లింగుస్వామితో పాటు నిర్మాత కూడా తమిళ్ ఇండస్ట్రీ కి చెందిన వాళ్లేనని సమాచారం.ఒకటిరెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రావచ్చంటున్నారు.ఏదైమైనా అది వచ్చేదాకా నమ్మలేం.ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్,బన్నీ ఆ ఇద్దరు దర్శకులతో ఎలా ఆడుకుంటున్నారో అర్ధం కావడం లేదూ!