త్రివిక్రమ్ తర్వాత ఆ డైరెక్టర్ తో ఎన్టీఆర్ …

Posted January 2, 2017

ntr combination with vikramkumar after trivikram
విక్రమ్ కుమార్ ..ఒకప్పటి ఈ ప్లాప్ డైరెక్టర్ మనం సినిమాతో టాప్ క్లాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండియా లోని మోస్ట్ ప్రామిసింగ్ దర్శకుల్లో ఒకడిగా ఎదిగారు .అందుకే తొలి సినిమాతో ప్లాప్ అందుకున్న అఖిల్ ని విక్రమ్ చేతికి అప్పజెప్పేస్తున్నాడు నాగ్ .అదీ విక్రమ్ సంపాదించుకున్న నమ్మకం .ఆ డైరెక్టర్ అఖిల్ తో సినిమా తర్వాత అక్కినేని కాంపౌండ్ నుంచి నేరుగా నందమూరి కాంపౌండ్ లోకి అడుగుపెడుతున్నారు.అది కూడా తారక్ తో ఓ సినిమా చేయబోతున్నాడు .

ఎన్టీఆర్,విక్రమ్ కుమార్ కాంబినేషన్ సెట్ చేసింది ఇంకెవరో కాదు .భారీ చిత్రాల నిర్మాత ,వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్.ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ఆర్కే ఓపెన్ హార్ట్ లో ఓపెన్ చేశారు. 2018 లో ఈ సినిమా ఉండొచ్చని తెలుస్తోంది.అప్పటికి ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమా పూర్తి అవుతుంది .విక్రమ్ ,అఖిల్ సినిమా రిలీజ్ అవుతుంది.అప్పుడు తారక్ ..విక్రమ్ ల సినిమా మొదలవుతుంది . చిరు,మహేష్ ,నాగ్ తో కూడా సినిమాలు చేయనున్నట్టు అశ్వనీదత్ ప్రకటించారు.