‘బాహుబలి 2’పై ఎన్టీఆర్‌ కామెంట్స్‌

0
118

 Posted April 28, 2017 at 17:08

ntr comments on bahubali 2 movie
జక్కన్న రాజమౌళి మరియు ఎన్టీఆర్‌లకు మంచి స్నేహం ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు అన్ని విషయాలను షేర్‌ చేసుకుంటూ ఉంటారు. ఇతర హీరోల సినిమాలను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించని ఎన్టీఆర్‌ తాజాగా జక్కన్న దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి 2’ సినిమాను చూశాడు. విడుదలైన మొదటి రోజే ‘బాహుబలి 2’ చిత్రాన్ని చూసిన ఎన్టీఆర్‌ సినిమా అద్బుతమంటూ జక్కన్న అండ్‌ టీంను అభినందించాడు.

‘బాహుబలి 2’ చిత్రాన్ని చూసిన తర్వాత ఎన్టీఆర్‌ స్పందిస్తూ.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలిపారని, జక్కన్న ఒక అద్బుత సినిమాను తెరకెక్కించాడంటూ అభినందనలు తెలియజేశాడు. ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రతి ఒక్కరు మంచి నటనతో ఆకట్టుకున్నారు. వాళ్లకు అభినందనలు తెలియజేశాడు. రాజమౌళి తన తర్వాత సినిమాను ఎన్టీఆర్‌తో చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలకు ఎన్టీఆర్‌ తాజాగా ‘బాహుబలి 2’పై స్పందించడం బలాన్ని చేకూర్చుతుంది.