ఎన్టీఆర్ ముందు రెండు మల్టీస్టారర్ ఆప్షన్స్..!

Posted December 3, 2016

NTR Locks Trivikram Srinivas

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్న ప్రశ్నకు ఇంకా కచ్చితమైన సమాధానం దొరకట్లేదు. తారక్ మెచ్చే కథను ఎవరు అందించట్లేదనే రూమర్ వస్తున్నా ఈమధ్యలోనే ఎన్టీఆర్ తన తర్వాత సినిమా చేసేది సోలోగా కాదు మల్టీస్టారర్ గా అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. కొద్దిరోజులుగా తారక్, అల్లు అర్జున్ ఓ మల్టీస్టారర్ మూవీ ప్లానింగ్ లో ఉందంటూ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పూరి ఈ ఇద్దరి ఇమేజ్ కు సరిపోయే కథ సిద్ధం చేశాడని ఇద్దరు ఓకే అంటే సినిమా సంచలనాలను సృష్టించడం ఖాయమేనని అంటున్నారు.

అసలు పూరితో సోలో సినిమానే తీయడానికి ఇష్టంలేని తారక్ మల్టీస్టారర్ అంటే మొగ్గుచూపుతాడా అన్న డౌట్ రాకమానదు. అందులోనూ మల్టీస్టారర్ అంటే కాస్త కష్టమే.. అయినా సరే తారక్ పూరి చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడని టాక్. ఇక ఇదిలా ఉంటే పటాస్, సుప్రీం సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి కూడా ఎన్టీఆర్ కు ఓ మల్టీస్టారర్ కథ చెప్పాడట. అయితే ఇందులో నాని మరో హీరోగా ఉండే అవకాశాలున్నయట.

ఎన్టీఆర్, నాని కాంబినేషన్ అయితే భలే త్రిల్ అనిపించేలా ఉంది కాని తారక్ తో నాని.. నాని తో ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశాలు చాలా తక్కువ. మరి ఈ రెండు ఆప్షన్స్ లో తారక్ ఏది ఫైనల్ చేస్తాడో కాని ఒకవేళ ఈ కాంబినేషన్స్ కుదిరితే మాత్రం తెలుగు తెరపై మరో స్పెషల్ మల్టీస్టారర్స్ చూసే అవకాశం దొరికినట్టు అవుతుంది. మరి మల్టీస్టారర్ పై మొగ్గుచూపుతాడా లేక సోలో గానే సైరన్ మోగిస్తాడా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.