ఎన్టీఆర్ ను ఇంప్రెస్ చేశాడా..!

Posted November 24, 2016

ntr impressed with bobby storyయంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా ఎవరితో అన్న కన్ ఫ్యూజన్ ఇంకా వీడలేదు సరికదా కొత్త కొత్త కాంబినేషన్లో సినిమా ఉంటుంది అంటూ ఊరిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా అనీల్ రావిపూడి, వక్కంతం వంశీ ఫైనల్ అన్నట్టు టాక్ రాగా రీసెంట్ గా వినాయక్ తో సీక్రెట్ మీటింగ్ పెట్టి అదుర్స్-2 కి ప్లాన్ చేస్తున్నారని అన్నారు. తీరా చూస్తే అది తుస్సుమనిపించే న్యూస్ అని తేలింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో డైరక్టర్ జూనియర్ తో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడట.

పవర్ తో రవితేజకు హిట్ అందించిన డైరక్టర్ కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి తారక్ ను ఈమధ్యనే కలిసి ఓ అదిరిపోయే కథ చెప్పాడట. స్టోరీ పవర్ ఫుల్ గా ఉండటంతో తారక్ కూడా కాస్త ఎక్సయిట్ అయ్యాడట. పవర్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ తీసినా అది అంతగా వర్క్ అవుట్ కాలేదు కాని స్వతహాగా తన కథ కాబట్టి బాబి మీద నమ్మకం పెడుతున్నాడట ఎన్టీఆర్.

పవర్ కాంబినేషన్ రిపీట్ అయ్యేలా ఈమధ్యనే రవితేజతో ఓ సినిమా సెట్స్ మీద వెళ్తుంది అనుకుంటే అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. సో ఇప్పుడు బాబి తారక్ కు కథ వినిపించడంతో మరోసారి అతని గురించి హాట్ న్యూస్ అయ్యింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ కు చెప్పింది రవితేజతో తీద్దామనుకున్న కథ మాత్రం కాదట. సో తారక్ మెచ్చాడంటే కచ్చితంగా అందులో గట్టి విషయం ఉన్నట్టే.