ఎన్టీఆర్ ఈస్ట్ గోదావరి ట్రిప్ తో ఆ ఇద్దరికీ వర్రీ ?

Posted December 24, 2016

ntr in janakiram son function
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈస్ట్ గోదావరి ట్రిప్ వెనుక అసలు కారణం బయటికి వచ్చింది.రాజమండ్రి దాకా విమానంలో అక్కడనుంచి కారులో కాకినాడ కి వెళ్లడం అందరికీ తెలిసిందే. అన్నయ్య జానకిరామ్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్ కోసం ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్,హరికృష్ణ కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు.జానకి రామ్ అత్తగారి వూరు కాకినాడ కావడంతో అక్కడే ఈ ఫంక్షన్ చేశారు.ప్రమాదంలో చనిపోయిన జానకిరామ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పేందుకే ఎన్టీఆర్ చాన్నాళ్ల తర్వాత ఆంధ్రాలో అడుగుపెట్టాడు.అది ముందుగా తెలియడం వల్లే ఫాన్స్ ఆ స్థాయిలో హంగామా చేశారు.ఎన్టీఆర్ కూడా వాళ్ళ హడావుడిని బాగా ఎంజాయ్ చేసినట్టుంది.
గుట్టుగా సాగాల్సిన ఈ పర్యటన కాస్త అందరికీ తెలిసేలా చేయడంతో ఎన్టీఆర్ ఇంకేదో ఆలోచిస్తున్నాడని కొందరు చెప్తున్నారు.దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు లో వర్రీ మొదలైంది. పవన్ దూరమయ్యాక ఎన్టీఆర్ కూడా బయటికొస్తే ఎలా అని అయన మధనపడుతున్నారు.కొడుకు భవిష్యత్ కి ఇబ్బందులు వస్తాయేమోనని ఆలోచిస్తున్నారు.ఈ పరిణామం మీద వైసీపీ అధినేత జగన్ పైకి సంతోషంగా ఉన్నట్టు అనిపించినా ఆయనకి వుండే సమస్య ఆయనకి వుంది.ఇంతకు ముందు పవన్ ,ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు బయటికొస్తే వాళ్ళ జనాకర్షణ శక్తి ముందు తన చరిష్మా మసకబారుతుందని జగన్ సందేహిస్తున్నారు.ఏదేమైనా ఓ చిన్న ట్రిప్ తో ఎన్టీఆర్ ఇద్దరు రాజకీయ దిగ్గజాల్ని వర్రీ కి గురిచేశాడు.