బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్ గా ఎన్టీఆర్!!

Posted February 2, 2017

ntr is best indian dancer as per google search reportఇండియాలో డాన్స్ కి, డాన్సర్స్  కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక సినిమాల్లో  హీరోలు డాన్స్ చేస్తుంటే అభిమానులు మైకంతో ఊగిపోతుంటారు, డాన్స్ వచ్చినా రాకపోయినా హీరోలను అనుకరిస్తూ డాన్స్ లు చేసేస్తుంటారు. అంతలా ఇండియన్స్ డాన్స్ ని ఇష్టపడుతుంటారు. ఇక అసలు విషయానికొస్తే బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్స్ పేరిట గూగులో సెర్చ్ చేస్తే ఒక ఆశ్చర్యకరమైన జాబితా వచ్చిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ జాబితాలోని  టాప్-10లో  ముగ్గురు టాలీవుడ్ హీరోలు స్థానాన్ని దక్కించుకున్నారు.  

జూనియర్ ఎన్టీఆర్ ప్రథమ స్థానంలో ఉండగా, అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం పదో స్థానంలో ఉన్నట్లు ఈ జాబితా పేర్కొంది. ఇక రెండవ స్థానంలో హృతిక్ రోషన్, నాల్గవ స్ధానంలో ప్రభుదేవా, ఐదవస్ధానంలో లారెన్స్, ఆరవస్ధానంలో మాధురి దీక్షిత్, సెవెన్త్ ప్లేస్ లో తమిళ్ హీరో విజయ్, ఎనిమిదవ స్థానంలో రాఘవ్ క్రోక్ రోజ్, తొమ్మిదవ స్థానంలో ఐశ్వర్యరాయ్ ఉన్నారు. ఏమైనా టాప్ టెన్ ఇండియన్ డాన్సర్స్ లో మన టాలీవుడ్ హీరోలు ఉండడం చాలా హ్యాపీగా ఉంది కదండీ.