కన్నడన దున్నేస్తున్న ఎన్టీఆర్‌

0
101

 

ntr jai lava kusa movie karnataka distribution rights sold out
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు కర్ణాటకలో భారీగా ఫ్యాన్స్‌ ఉన్నారు అనే తాజాగా మరోసారి వెళ్లడైంది. కర్ణాటకలో ఎన్టీఆర్‌కు ఉన్న అభిమానులు ఏ స్థాయిలో ‘జై లవకుశ’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా భారీగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ ‘జై లవకుశ’ చిత్రం కర్ణాటక రైట్స్‌ను అత్యధిక మొత్తంకు కొనుగోలు చేసింది.

ఇప్పటి వరకు కర్ణాటకలో బాహుబలి మినహా మరే సినిమా కూడా 12 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది లేదు. కర్ణాటకలో ఎన్టీఆర్‌ నటించిన గత చిత్రాలు కూడా పలు బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. దాంతో ‘జై లవకుశ’ చిత్రాన్ని ఏకంగా 14 కోట్లకు అమ్ముడు పోయింది. ఇక అన్ని ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమచారాం ప్రకారం విడుదలకు ముందే ఖచ్చితంగా 85 కోట్ల బిజినెస్‌ను కళ్యాణ్‌ రామ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో హీరోయిన్స్‌గా రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు నటించబోతున్నారు. మూడు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్‌ కనిపిస్తాడని తెలుస్తోంది. త్వరలోనే సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.