ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభం

Posted February 10, 2017

ntr jai lava kusa movie start‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలతో ఎన్టీఆర్ వరుస విజయాలను అందుకోవడంతో ఆయన నెక్ట్స్ చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కొత్త చిత్రంలో త్రిపాత్రాభినయం చేయనున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఆశించిన విధంగానే ఎన్టీఆర్ తన కొత్త చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించేశాడు.

జై లవకుశ పేరుతో తెరకెక్కనున్న ఆ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమాను ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్ పతాకంపై నిర్మిస్తుండడం విశేషం. కాగా ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడని, ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతానికి రాశిఖన్నాను  ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేశామని మిగలిన హీరోయిన్ల డేట్స్ ఇంకా అడ్జెస్ట్ కాలేదని యూనిట్ సభ్యులు చెప్పారు. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అంటున్నారు. డ్యుయల్ రోల్లో మెప్పించిన ఎన్టీఆర్  ఇప్పుడు త్రిపాత్రాభినయంలో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.