జనతాగ్యారేజ్ శ్రీమంతుడిని దాటేస్తుందా?

  ntr janatha garage movie crossed srimanthudu movie
బెనిఫిట్ షో తరువాత పెదవివిరుపులు..నొసలు చిట్లింపులు మధ్య రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ టాలీవుడ్ టాప్ త్రీ లోకి ఎంటర్ అయిపోయింది.ఇక జనతాగ్యారేజ్ కన్నా ముందున్నవి రెండే సినిమాలు.టాప్ ప్లేస్ లో ఉన్న బాహుబలి,రెండో ప్లేస్ లో ఉన్న శ్రీమంతుడు తరువాతి స్థానం గ్యారేజ్ దే.125 కోట్ల గ్రాస్,80 కోట్ల షేర్ తో ఊహించని కలెక్షన్లు రాబట్టిన ఇక ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి.రెండో స్థానంలో ఉన్న శ్రీమంతుడు 86 కోట్ల షేర్ కొల్లగొట్టింది.
జనతా గ్యారేజ్ ఇంకో 6 కోట్లు షేర్ రాబడితే గానీ శ్రీమంతుడిని దాటలేదు.ఈవారం రిలీజ్ అయిన నిర్మలా కాన్వెంట్ ,సిద్ధార్థ నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో గ్యారేజ్ మీద పెద్ద ఎఫెక్ట్ పడలేదు.వీకెండ్స్ ఫుల్ అయిపోయింది.

కానీ వచ్చే వారం ఫుల్ ఫామ్ లో ఉన్న నాని మజ్ను గా రాబోతున్నాడు.ఉయ్యాలజంపాలా ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం మీద కూడా మంచి అంచనాలే వున్నాయి.ఇక కోలీవుడ్ లోమోస్ట్ ప్రామిసింగ్ దర్శకుడు సాల్మన్ ప్రభు ,ధనుష్ కాంబినేషన్ లోవస్తున్న డబ్బింగ్ మూవీ రైల్ మీద భారీ అంచనాలే వున్నాయి.వాటిలో ఏ సినిమా లేక రెండు సినిమాలు హిట్ అయితే గ్యారేజ్ కి శ్రీమంతుడిని దాటడం కష్టం కావచ్చు.ఇప్పటిదాకా అంచనాలకి అందకుండా దూసుకొచ్చిన గ్యారేజ్ కి ఇక్కడ గట్టి పరీక్ష తప్పదు.