రిస్క్ వద్దు అతన్నే ఫైనల్ చేద్దామన్న జూనియర్..!

Posted December 21, 2016

Ntr Not Interest To Do Risk His Next

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం బాబితో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత చాలా కథలు విన్న తారక్ ఫైనల్ గా బాబికి ఓటేశాడు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా తమిళ యువ సంగీత కెరటం అనిరుథ్ ను తీసుకున్నారని టాక్ వచ్చింది. ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు తన మ్యూజిక్ వినిపించిన అనిరుథ్ కొలెవెరి వలలో తెలుగు ప్రేక్షక్లును పడేసేలా చేశాడు. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీకి అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

పవన్ సినిమా వెంటనే తారక్ సినిమా రావడం రావడమే రెండు పెద్ద ప్రాజెక్టులు చేజిక్కించుకున్నాడని అనిరుథ్ ను పొగడసాగారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం తారక్ అనిరుథ్ తో రిస్క్ ఎందుకని మరోసారి దేవి శ్రీతో కానిచ్చేస్తున్నాడట. ఇప్పటికే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ హిట్లతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ అందుకున్న దేవి తారక్ ల కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతుందన్నమాట. తెలుగులో తన పాటలు కొత్తగా ఉంటాయని కెరియర్ మంచి జోష్ లో ఉన్న టైంలో ఈ రిస్క్ ఎందుకని తారక్ ఈ నిర్ణయానికి వచ్చాడట.

సో అలా తారక్ ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేజారిందన్నమాట. ఇక అదే కాకుండా తెలుగులో పవర్ స్టార్ సినిమాతో పాటుగా రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట అనిరుథ్. కాకపోతే మనవాడు ట్యూస్ అంత స్పీడ్ గా ఇవ్వడట కాస్త లేట్ తీసుకుంటాడట అందుకే ఇదవరకు బ్రూస్ లీ, అఆ సినిమాలకు ముందు అనిరుథ్ ను అనుకున్నా టైం పట్టేలా ఉందని వేరే వారితో కానిచ్చేశారు.