గాలిలో ఎన్టీఆర్ పొలిటికల్ ఫ్యూచర్?

Posted February 14, 2017

ntr political future plans
ఎన్టీఆర్ ..కొన్నేళ్లుగా సినీ రంగానికే పరిమితమయ్యారు.రాజకీయానికి దూరంగా వున్నారు. అంటే ఎన్టీఆర్ రాజకీయాలకి శాశ్వతంగా దూరమైపోయినట్టేనా? కానే కాదట.రాజకీయాలకి దూరంగా ఉండటం తాత్కాలిక స్టెప్ మాత్రమే.అవకాశం వచ్చినప్పుడు మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు.అంతే కాదు ప్రస్తుతం ఆయనలో రాజకీయపరంగా ఎలాంటి అనిశ్చితి లేదు.ఫుల్ క్లారిటీ తో వున్నారు.చంద్రబాబు,బాలయ్య,లోకేష్ ఇలా ఎవరు గుర్తించినా,గుర్తించకపోయినా పొలిటికల్ గా వైసీపీ అధినేత జగన్ కి వ్యతిరేకంగా,టీడీపీ కి అనుకూలంగా వుండాలని ఎన్టీఆర్ డిసైడ్ అయిపోయారు .ఈలోపు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ స్టాండ్ మార్చుకోకూడదని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు.టీడీపీ శ్రేణుల మనోభావాలకు తగ్గట్టే నడుచుకొని సరైన అవకాశం కోసం ఎదురు చూడాలని ఎన్టీఆర్ సిద్ధపడ్డారు.ఈ ప్రాసెస్ లో బాబు అండ్ కో ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు.ఈ విషయం ఎలా బయటికి వచ్చిందో తెలుసా ?

ఇటీవల ఓ రోజు ఎన్టీఆర్ తన భార్యతో కలిసి విశాఖ వెళ్లే విమానం ఎక్కారు.అదే విమానంలో చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు,ఆయన సతీమణి పురందేశ్వరి వున్నారు.ఆ టైం లో ఎన్టీఆర్,దగ్గుబాటి మధ్య రాజకీయ అంశాల ప్రస్తావన వచ్చిందట.ఆ మాటల్లో ఎన్టీఆర్ తన రాజకీయ వ్యూహం గురించి మామతో పంచుకున్నారట.ఏ పరిస్థితులు ఎదురైనా టీడీపీ కి,ఆ పార్టీ అభిమానుల ఆలోచనలకి భిన్నంగా వ్యవహరించబోనని తేల్చారట.జగన్ కి వ్యతిరేకంగానే ఎన్నటికీ తన పొలిటికల్ స్టాండ్ ఉంటుందని చెప్పారట.అంటే బాబు వేరు …టీడీపీ వేరు అని ఎన్టీఆర్ గుర్తించినట్టుంది.అందులో నిజం లేకపోలేదు.ఒక్క టీడీపీ లోనే కాదు భారత్ లోని ఎన్నో రాజకీయ పార్టీల సంప్రదాయ ఓటర్లు ..ఆ పార్టీ నాయకుడు అంటే ఇష్టం లేకున్నా అదే పక్షానికి ఓటు వేస్తారు.ఈ సునిశిత అంశాన్ని గుర్తించడమే ఎన్టీఆర్ రాజకీయ పరిణితికి ఓ నిదర్శనం.అది గమనించిన దగ్గుబాటి తన సన్నిహితులతో ఎన్టీఆర్ ని తక్కువగా అంచనా వేయకూడదని తన సన్నిహితులతో వ్యాఖ్యానించారట.ఇప్పుడు చెప్పండి ఎన్టీఆర్ తన పొలిటికల్ ఫ్యూచర్ గురించి గాలిలో చెప్పినట్టా..కాదా ?