200 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్..

Posted September 22, 2016

 ntr reached 200 crores club one year
జనతా గ్యారేజ్ తో భారీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ కి మరో అరుదైన రికార్డు కూడా సొంతమైంది.ఒక్క ఏడాదిలోనే 200 కోట్లు కొల్లగొట్టిన హీరో గా టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.నాన్నకు ప్రేమతో దాదాపు 90 కోట్ల గ్రాస్ రాబడితే ..రీసెంట్ బ్లాక్ బస్టర్ జనతాగ్యారేజ్ ఇప్పటికే 125 కోట్ల గ్రాస్ సాధించింది.అంటే ఏడాది వ్యవధిలో తారక్ కొల్లగొట్టిన మొత్తం 215 కోట్లు.జనతాగ్యారేజ్ ఇంకా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతోంది.

సింహాద్రి తరువాత రేసులో వెనుకబడ్డ తారక్ టెంపర్ తో మళ్లీ ట్రాక్ ఎక్కాడు.నాన్నకి ప్రేమతో ఎన్టీఆర్ కెరీర్ లోనే అప్పటిదాకా పెద్ద హిట్ గా నిలిచింది.ఇప్పుడు జనతాగ్యారేజ్ టాలీవుడ్ టాప్ త్రీ లోస్థానం సంపాదించింది.హ్యాట్రిక్ హిట్స్ తో మళ్లీ నెంబర్ వన్ రేసులోకి దూసుకొస్తున్నాడు తారక్.ఈ టైం లో మరో బ్లాక్ బస్టర్ పడితే ఎన్టీఆర్ టాప్ చైర్ లోకూర్చోవడం ఖాయం.అందుకే కొత్త సినిమా విషయంలో తారక్ ఆచితూచి అడుగులేస్తున్నారు.