ఎప్పుడు చూడని బాలయ్య.. శాతకర్ణి ట్రైలర్ పై యంగ్ టైగర్..!

Posted December 16, 2016

Ntr Response About Balakrishna Sathakarni Trailerనందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఎన్నో సంచలనాలకు నాంధి పలుకుతుంది. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ గురించి సిని పరిశ్రమ మొత్తం తమ అభినందనలు తెలుపుతున్నారు. ఇక ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు అలియాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా శాతకర్ణి ట్రైలర్ గురించి ప్రస్థావించారు.

తాము ఎప్పుడు చూడని బాలయ్యను చూపించిన క్రిష్ కు కృతజ్ఞతలు.. బాబాయ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడంటూ బాలకృష్ణ శాతకర్ణి ట్రైలర్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. ఇది కేవలం శాతకర్ణి ట్రైలర్ మహోత్సవమే కాదు కొద్దిరోజులుగా బాబాయ్ అబ్బాయ్ ల మధ్య ఏదో జరుగుతుంది అన్న వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టి నందమూరి అభిమానులందరు చేసుకునే ఉత్సవం. బాబాయ్ అంటూ బాలకృష్ణను ట్విట్టర్ సాక్షిగా పలుకరించిన తారక్ ఆ మాటతో నందమూరి అభిమానుల మనసుని తాకేశాడు. ఇక ఈ ట్రైలర్ ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.