ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మూవీ అప్‌ డేట్స్‌

0
88

 Posted May 4, 2017 at 17:21

ntr trivikram movie opening details
ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే ఎప్పటికప్పుడు ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమాను ఈ సంవత్సరంలో ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ మూవీ ఈ సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభం కానుందట.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ నిర్మాణంలో ‘జై లవకుశ’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఆ సినిమాలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ‘జనతాగ్యారేజ్‌’ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ రేంజ్‌ భారీగా పెరిగింది. దాంతో పాటు ఎన్టీఆర్‌ సినిమాల మార్కెట్‌ కూడా పెరిగింది. అందువల్లే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమాను రాధాకృష్ణ ఏకంగా 75 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే సమ్మర్‌ ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.