జనతా గ్యారేజ్ పై ఎన్టీఆర్ అసంతృప్తి?

0
283

Posted September 27, 2016

 ntr unsatisfied janatha garage movie budget
దాదాపు 13 ఏళ్ల తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ తో భారీ హిట్ సొంతమైంది.అలాంటి సినిమా అందించిన దర్శకుడు కొరటాల శివకి జీవితాంతం రుణపడి ఉంటానని సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటూనే వున్నాయి. అంతలోనే ఓ అంశంలో జనతా గ్యారేజ్ పై ఎన్టీఆర్ అసంతృప్తి తో ఉన్నట్టు తెలుస్తోంది.సినిమా ఇప్పటికే 135 కోట్లు గ్రాస్ కొల్లగొట్టిందని అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారని ఎన్టీఆర్ దగ్గర సమాచారం ఉందంట.అయితే దాన్ని ధృవీకరించకుండా 120 కోట్ల దగ్గర ప్రకటన ఇచ్చి నిర్మాతలు మౌనంగా ఉండటంపై ఎన్టీఆర్ హర్ట్ అయ్యారట.సూపర్ హిట్ సినిమా విషయంలోనూ ఇలా జరగడంపై అయన అసంతృప్తిగా ఉన్నారంట.అందుకే కొత్త సినిమాపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుందట.