తమిళనాడుకి కొత్త సీఎస్ ..ఇంకో ఐఏఎస్ పై ఐటీ దాడులు..

Posted December 22, 2016

o panneerselvam dismissed cs ram mohan rao and appointed to that place girija vaidyanathan
అవినీతి,అక్రమాలతో భారీగా ఆస్తులు కూడబెట్టిన తమిళనాడు సీఎస్ పీ.రామ్మోహన్ ని ఆ పదవి నుంచి తొలగిస్తూ సీఎం పన్నీర్ సెల్వం నిర్ణయం తీసుకున్నారు.అయన స్థానంలో మరో ఐఏఎస్ అధికారి గిరిజ వైద్యనాధన్ ని కొత్త సీఎస్ గా నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం కొద్దిసేపటి కిందట ఉత్తర్వులు జారీ చేసింది.మరోవైపు రామ్మోహన్ అక్రమాస్తులపై బయటికి వచ్చిన వివరాలకి భిన్నంగా అసలు పరిస్థితి ఉందని తెహెల్కా కధనం ఇచ్చింది.వందకోట్లకి పైగా డబ్బు,100 కేజీలకి పైగా బంగారం ఐటీ దాడుల్లో దొరికినట్టు తెహెల్కా పేర్కొంది.

తమిళనాట ఐటీ దాడుల పరంపర కొనసాగుతూనే వుంది. సీఎస్ రామ్మోహన్ ఆస్తలపై దాడి జరిపిన వెంటనే ఐటీ అధికారులు మరో ఐఏఎస్ ఇంటికి వెళ్లారు.గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ గా పని చేస్తున్న నాగరాజన్ ఇల్లు,ఇతర స్థావరాల మీద దాడి చేసి అక్రమంగా దాచి ఉంచిన 1 .25 కోట్ల డబ్బుతోపాటు,6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఇంకా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకి సంబందించిన పత్రాలు కూడా ఐటీ అధికారులకి లభించాయి.