జయ వద్దంటే… పన్నీర్ ఔనన్నారు

Posted December 10, 2016

o panneerselvam green signal to maduravoyal chennai port flyover but jayalalitha reject this workతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిచెందిన తర్వాత తొలిసారిగా సమావేశమైన ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె వ్యతిరేకించిన ఓ వివాదాస్పద ప్రాజెక్టుకు సీఎం పన్నీర్‌ సెల్వం మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపింది. మధురవాయల్‌- చెన్నై పోర్టు ఫ్లైఓవర్‌ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో జయలలిత ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. ‘అమ్మ’ మృతిపట్ల సంతాపం తెలిపిన మంత్రివర్గం..మెరీనాబీచ్‌లో జయలలిత ఘాట్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.తమిళనాడులో జయలలిత స్మారక మందిరం నిర్మించాలని నిర్ణయించారు.

మంత్రివర్గం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, ఇతర మంత్రులు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.