పన్నీర్ లో అపరిచితుడు?

Posted February 9, 2017

o panneerselvam warning to sasikala
నిన్నమొన్నటిదాకా నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకంగా కనిపించిన తమిళ సీఎం పన్నీర్ సెల్వం ..చిన్నమ్మ మీద యుద్ధం ప్రకటించాక రెచ్చిపోతున్నారు. ఇంకా తమిళ సీఎం పీఠం ఎవరిదో తేలకముందే ఆయన దూకుడు పెంచారు.శశికళని పోయెస్ గార్డెన్ నుంచి తరిమేస్తామని హెచ్చరించారు.అమ్మ నివసించిన ఆ ఇంటిని జయ మెమోరియల్ కేంద్రంగా చేస్తామని చెప్పారు. ఇదంతా జరగాలంటే పన్నీర్ మళ్లీ తమిళ సీఎంగా పగ్గాలు చేపడితేనే సాధ్యం అవుతుంది.ఆయనకి గట్టి నమ్మకం ఉండి ఈ మాటలు అంటున్నారో లేక ఆ నమ్మకం కలిగించి ఎమ్మెల్యేల్ని దగ్గరికి రప్పించుకోడానికి అంటున్నారో గానీ మొత్తానికి రెచ్చిపోతున్నారు.

పన్నీర్ తాజా ప్రకటనలు,వార్నింగ్ లు చూసి రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. అధికారంలో వున్నా లేకున్నా సౌమ్యంగా మాట్లాడే పన్నీర్ లో ఇంత మార్పు చూసి ఆయనలో అపరిచితుడు బయటికి వస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.పాత మనిషిని సరికొత్తగా చూడాల్సి వచ్చినపుడు ఇలాంటి కామెంట్స్ సహజమే కదా !