ఒబామా చేతిలో ట్రంప్ జాతకం ..!

Posted December 19, 2016

obama handled on trump horoscope
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్న ట్రంప్ ను ఒబామా ప్రమాణ స్వీకారం చేయనిస్తారా?అయన ఎన్నికల్లో గెలవడానికి రష్యా సాయం చేసిందా? డెమోక్రాటిక్ పార్టీ పెద్దల, హిల్లరీ మెయిల్స్ ని ట్రంప్ హ్యాక్ చేసాడని ఒబమా ప్రకటించటం ఇప్పుడు అమెరికా లో హాట్ టాపిక్ గా మారింది.రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ గెలుపు కోసం కృషి చేసాడని , ఈ విషయం ట్రంప్ కి కూడా తెలుసనీ ఒబామా గట్టిగ చెప్తూ అందుకు తగిన ఆధారాలుకూడా ఉన్నాయని అంటున్నారు.

వైట్ హౌస్ కూడా ఈ మేరకు పుతిన్ ప్రమేయం ఉందని, నిఘా వర్గాలు కూడా హ్యాక్ జరిగిందని ధృవీకరించాయి .ఇప్పుడు ట్రంప్ ని అధ్యక్షుడు కాకుండా అడ్డుకునే శక్తి కేవలం ఒబామా కి మాత్రమే ఉందట. ఎన్నికలని రద్దు చేసే యోచనలో ఉందట అమెరికా ..నేషనల్ సెక్యూరిటీ ప్రెసిడెంటిల్ డైరెకటివే యాక్ట్ 51 ప్రకారం దేశం లో ఎమర్జెన్సీని బట్టి ఈ యాక్ట్ ని ఉపయోగించే హక్కు ఒబామాకి ఉందని అంటున్నారు అమెరికన్స్ .

ఎలక్ట్రోరల్ కాలేజీ సీట్లు పొందిన డోనాల్డ్ ట్రంప్‌ లేదా .. మెజారిటీ ఓట్లు కొల్లగొట్టిన హిల్లరీ క్లింటనా..? మిస్టర్ ప్రెసిడెంట్‌నా..? మేడమ్ ప్రెసిడెంట్‌నా..? అగ్రరాజ్య పాలనా పగ్గాలు చేపట్టేదెవరో ఈ రోజు జరిగే ఎలక్ట్రోరల్ కాలేజీ ఎన్నికల్లో స్పష్టమవనుంది. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల నిరసన ర్యాలీలు, ట్రంప్ తమ అధ్యక్షుడు కాదంటూ ఆందోళనలు వెల్లువెత్తున్న తరుణంలో 538 మంది ఎలక్టార్స్‌పై ఒత్తిడి పెరిగింది. ట్రంప్‌కు 306 ఎలక్ట్రోరల్ కాలేజీ సీట్లు రాగా.. హిల్లరీకి 232 సీట్లు వచ్చాయి. ఈ 538 మంది కలిసి అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటారు. వీరు ఎవరిని ఎన్నుకుంటారో వారే జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరు పార్టీకి నియమనిబద్ధులు కాదు. ప్రజామోదం ప్రకారం ఎవరికయినా ఓటు వేయొచ్చు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు 270 మంది ఎలక్టార్స్ మద్దతు కావాలి.

ప్రస్తుత లెక్కల ప్రకారం ట్రంప్ గెలుపు సునాయాసమే. కానీ ఇప్పటికే పలువురు సొంతపార్టీ ఎలక్టార్స్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. అంతేకాక ప్రజల నుంచి ఎలక్టార్స్‌పై ఉన్న ఒత్తిడి మేరకు.. హిల్లరీకి ఓటేస్తారా..? లేదా ట్రంప్‌కే కట్టుబడి ఉంటారా..? అనేది తేలనుంది. రిపబ్లికన్ పార్టీకి చెందిన 38 మంది ఎలక్టార్స్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే హిల్లరీ గెలుపు ఖాయం. మరి అమెరికాలో ఏం జరగనుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.