కొత్త బళ్ళు అమ్మినోళ్లే… పాత బళ్ళు కొనేస్తారు .

Posted December 19, 2016

old vehicles recycling by companiesఅబ్బా ఇదెప్పుడో కొన్న బైక్ అమ్ముదాం అని ఉన్నా అమ్ముకోలేని పరిస్థితి ఇంట్లో ఉన్నా అడ్డం పోనిలే బాగు చేయిద్దామా అంటే బోలెడు ఖర్చు బైటికెళ్తే పొల్యూషన్ అంటూ కేసు లో .ఏమి చేయాలో అర్ధం కానీ పరిస్థితి ..అనే మాటల్ని తరచూ వింటుంటాం..ఇక నుంచి ఆ అవసరం లేదు ఆ బాధలకుచెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందట.కాలం చెల్లిన వాహనాల కారణం గా పొల్యూషన్ సమస్యలు వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించింది.

నెక్స్ట్ ఇయర్ లో ప్రతి సంస్థ ఇలా కాలం చెల్లిన వాహనాలను తిరిగి ఆయా కంపెనీలు రీసైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకొంటోందట.సో ఇంట్లో ఎలాంటి స్క్రాప్ ఉండదు అన్నమాట…ఇటీవల ఢిల్లీ లో పొల్యూషన్ సమస్య తీవ్రం గా ఉందనే విషయాన్ని మనం తరచూ విన్నాం సమస్యల్ని చూసాం కూడా..సో కేంద్రం త్వరగానే పొల్యూషన్ మీద ద్రుష్టి సారించి చర్యలు తీసుకొంటే పొగరహిత భారత దేశాన్ని చూసే అవకాశం కలుగుతుందేమో కదా ..