ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’

om namo venkatesaya prerelease business

కింగ్ నాగార్జున ప్రెజెంట్ ఏ రేంజ్ ఫాంలో ఉన్నాడో అందరికి తెలిసిందే.. వరుస హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న నాగార్జున ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ సినిమా చేస్తున్నాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండే అంచనాలను పెంచేసింది. ఇక మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి చిత్రాల సక్సెస్ లతో నాగ్ సినిమా అంటే షూటింగ్ స్టేజ్ లోనే బిజినెస్ అయిపోతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓం నమోవెంకటేశాయ సినిమా ఇప్పటికే 30 కోట్ల బిజినెస్ చేసేసిందట.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్లో ఉందంటే రిలీజ్ అయ్యాక ఈ సినిమా మళ్లీ నాగ్ స్టామినా చూపిస్తుందని చెప్పొచ్చు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా హతిరాం బాబా జీవిత చరిత్రతో తెరకెక్కించబడుతుంది. చేస్తున్న సినిమాలన్ని హిట్ అవడంతో నాగ్ ఆ రేంజ్ కొనసాగించడానికి ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అనమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి తరహాలో ప్రేక్షకులకు భక్తిపరవశంలో ముంచేందుకు వస్తున్న ఓం నమో వెంకటేశాయ ఏ రేంజ్లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. అనుష్క, విమలా రామన్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా చేస్తుండగా ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా సౌరబ్ రాజ్ నటిస్తున్నాడు.