“ఓం నమో వేంకటేశాయ”  సినిమా పేరు మారనుందా..?

Posted February 6, 2017

om namo venkatesaya title changedఓం నమో వేంకటేశాయ”  సినిమా పేరు మారనుందా… అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ భక్తిరస చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ వివాదాస్పందంగా మారింది.   

తమ జాతికి చెందిన హథీరామ్‌ బాబా జీవిత చరిత్రపై ఈ మూవీ తెరకెక్కినప్పుడు ఓం నమో వేంకటేశాయ టైటిల్‌ పెట్టడం ఏంటని  గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పేరు మార్చాల్సిందేనంటూ  దర్శకుడు రాఘవేంద్రరావు దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. సినిమా టైటిల్‌ను ‘హాథీరామ్‌ బాలాజీ’గా మార్చాలని వారు డిమాండ్‌ చేశారు. మరి ఈ విషయంపై దర్శకనిర్మాతలతో పాటు నాగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.