ఒక్కసారిపోతే మళ్ళీ రాదు….

0
143

Posted October 5, 2016

    once miss faith no again repeat faith

జ్ఞానం.. ధనం… విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు, వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. తిరిగి ఎప్పుడు?ఎక్కడ కలుసుకోవాలి అనే ప్రశ్న వచ్చింది! ముగ్గురు ఆలోచించసాగారు!

ఇంతలో జ్ఞానం అంటుంది.. ‘దేవాలయాలు.. విద్యాలయాల్లో నేను కలుస్తా’ అన్నది! విశ్వాసం మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది! కారణమేంటని జ్ఞానం.. ధనం అడిగారు..

అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది.. ‘మీరిద్దరూ విడిపోయినా.. వెళ్ళిపోయినా ఎక్కడో ఒకచోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది కుదరని పని. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు’ అన్నది!

విశ్వాసం మాటల్ని విని.. జ్ఞానం , ధనం ఆశ్చర్యపోయాయి! స్నేహం పట్ల.. విడిపోవడం పట్ల విశ్వాసానికున్న గొప్ప అభిప్రాయాల్ని మెచ్చుకున్నాయి!
నీతి: ధనం ఎప్పుడైనా వస్తాయి. కానీ విశ్వాసం ఒక్కసారిపోతే మళ్ళీ రాదు!